‘ ది చెన్నై సిల్క్స్’ షోరూం ను ప్రారంభించిన మహేష్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ‘ ది చెన్నై సిల్క్స్’ సందడి చేశారు..ఆ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన గృహోపకరణాల షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబును చూసేందుకు అభిమానులు పెద్దయెత్తున తరలివచ్చారు. కొందరు అభిమానులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.బారిగేడ్లను సైతం లెక్కచేయకుండా ముందుకు రావడం తో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా , ఓ మహిళ స్పృహ కోల్పోగా, వైద్యం అందించి ఆమెను అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా ‘ది చెన్నై సిల్క్స్’ ప్రతినిధులు మాట్లాడుతూ, సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా గృహోపకరణాల షోరూమ్‌ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే తమ సంస్థ మన్నికైన వస్త్రాలు, మేలైన బంగారు ఆభరణాలు విక్రయిస్తోందని, తాజాగా అన్ని వస్తువులు ఒకే చోట లభించేలా తాజాగా గృహోపకరణాల షోరూమ్‌ ప్రారంభించామని తెలిపారు.కాగా చెన్నె సిల్క్స్‌కు మహేష్‌ బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తన 25 వ సినిమా చేస్తున్నాడు.