నేను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదు: హెబ్బా పటేల్‌

తెలుగు బాగ్‌బాస్‌ సీజన్‌-2 లో గతకొద్ది రోజుల నుంచి వైల్డ్‌కార్డు ద్వారా ప్రముఖ నటి.. కుమారి 21 ఎఫ్ ఫేమ్‌ హెబ్బా పటేల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హెబ్బా స్పందించింది. తను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన లేదని.. తనను దీనిపై ఎవరు సంప్రదించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నానని హెబ్బా తెలిపారు.

బిగ్‌బాస్‌ సీజన్-2 కి ప్రేక్షకుల నుంచి మిశ్రమా స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌ నాని శని, ఆది వారాల్లో హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్‌ శ్యామల, భాను ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్‌, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనిష్‌లు నామినేట్‌ అయ్యారు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్‌ నుంచి పలు ఆసక్తికర విషయాలు లీక్‌ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates