మెంటల్ సినిమా విషయంలో దర్శకుడికి అన్యాయం!

శ్రీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘మెంటల్’. ఇటీవల విడుదల ఈ చిత్రం ద్వారా తనకు అన్యాయం జరిగిందని దర్శకుడు కారణం పి బాబ్జి ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా వేరే వారి పేరు వేశారంటూ కరణం పి బాబ్జీ కంప్లైంట్ చేశారు. ఫస్ట్ లుక్ టీజర్ లు రిలీజ్ అయిన సమయంలో చిత్ర దర్శకుడిగా కరణం పి బాబ్జీ పేరు కనిపించినా.. విడుదలకు దగ్గరయిన తరువాత మాత్రం ఎస్ కె బషీద్ ను దర్శకుడిగా పరిచయం చేశారు. టైటిల్స్ లోనూ బషీద్ పేరుతోనే సినిమా రిలీజ్ అయ్యింది. దీంతో దర్శకుడిగా తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఈ సినిమా కోసం 5.17 లక్షల పెట్టుబడి కూడా పెట్టడంతో పాటు దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా కోసం పనిచేశానని తెలిపాడు. టైటిల్ విషయంలో హీరో శ్రీకాంత్ కు ఫోన్ చేస్తే అరగంటలో మార్పిస్తానని చెప్పి ఇంత వరకు మార్పించలేదని ఆరోపించారు. రేపటిలోగా పేరు మార్చకపోతే చాంబర్ ముందు దీక్ష చేస్తానని, అప్పటికీ స్పందించకపోతే బషీద్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు.
CLICK HERE!! For the aha Latest Updates