ప్రియాంక, నిక్‌ జొనాస్‌ల మ్యారేజ్ డేట్‌ ఫిక్స్‌..!

స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా , నిక్‌ జొనాస్‌ల నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా వెల్లడించింది. అయితే తాజాగా సెప్టెంబర్‌లో నిక్‌ బర్త్‌డే సందర్భంగా అదే రోజు వివాహ బంధంతో వీరిరువురూ ఒక్కటవుతారని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 16న నిక్‌ బర్త్‌డే సందర్భంగా వీరి వివాహానికీ అదే రోజు ముహుర్తం ఖరారైందని చెబుతున్నారు. సెప్టెంబర్‌లో మ్యారేజ్ ఏర్పాట్ల కోసమే ప్రియాంక చోప్రా సల్మాన్‌ ఖాన్‌తో నటిస్తున్న భారత్‌ చిత్రం నుంచి వైదొలిగినట్టు సమాచారం. భారత్‌ దర్శకుడు సైతం ప్రియాంక, నిక్‌ వివాహంపై పరోక్షంగా ట్వీట్‌ సంకేతాలు పంపడం ఈ వార్తలకు మరింత బలం చేకుర్చినట్లు అయింది.

వీరిద్దరూ ఇప్పటికే తమ ప్రేమ, వివాహ ప్రణాళికలపై ఇరు కుటుంబాలను ఒప్పించినట్టు తెలుస్తోంది. వయసు విషయంలో ప్రియాంక కంటే నిక్ జోనాస్ పదేళ్లు చిన్నవాడు. ప్రియాంక వయసు 36 సంవత్సరాలు కాగా, నిక్ జోన్స్ వచ్చే సెప్టెంబర్‌కు 26 ఏట ప్రవేశించనున్నాడు. తన కంటే తక్కువ వయసు ఉన్న కుర్రాడిని ప్రియాంక పెళ్లి చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.