బిగ్‌బాస్‌-2: మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్‌

తెలుగు బుల్లితెరపై మాటివీ లో బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. దానికి కారణం బిగ్‌బాస్‌ మొదటి సిజన్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడమే. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్‌ నడిపిన తీరే ఈ షో సక్సెస్‌కు ప్రధాన కారణం. ఈ షోకి అతను తెచ్చిన సక్సెస్‌ కారణంగానే ఇప్పుడు బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌ మొదలైంది. ఈ షోకి నాని హోస్ట్‌గ్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌2 కి ఎన్టీఆర్‌ కాకుండా నాని హోస్ట్‌గా ఫిక్స్‌ అయ్యాక కొందరు నిరాశపడినా, మరికొందరు నాని కూడా తన సహజత్వంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలడని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ షోకు విశేష స్పందన లభించిందని తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ సీజన్‌-2 మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్‌ను నిర్వాహకులు కాసేపటి క్రితమే విడుదల చేశారు. 15.1 రేటింగ్‌తో ప్రారంభమైందని తెలిపింది. టీవీ కార్యక్రమానికి సంబంధించి ఈ రేంజ్‌లో రావడం అరుదే. మొదటి సీజన్‌ సమయంలో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసినప్పుడు 16 పాయింట్లతో ఆందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే నాని తన స్థాయిలో ఈ షోను విజయవంతం చేయటం గమనార్హం. ఈ షో ప్రారంభం రోజున ప్రతి ఇ‍ద్దరిలో ఒకరు చూశారని, ఓవరాల్‌గా మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం మంది షోను చూశారని స్టార్‌ మా ప్రకటించుకుంది.