అతడితో ఇలియానా ముద్దులు ఫోటోలు లీక్!

ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబైకి వెళ్ళి టాలీవుడ్ కు పూర్తిగా దూరమైంది. అక్కడ ఆమె అనుకున్న విధంగా అవకాశాలు రాకపోవడంతో కాస్త డీలా పడింది. అరకొర అవకాశాలతో సర్ధుకుంటోంది ఈ బ్యూటీ. అయితే ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుందో.. ఏమో..? ఒక ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తోంది ఇలియానా. సాధారణంగా హీరోయిన్లు తెరపై ముద్దులతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఇలియానా మాత్రం నిజజీవితంలోని ముద్దులతో హడావిడి చేస్తోంది.
తన బాయ్ ఫ్రెండ్ తీస్తున్న హాట్ ఫోటోలతో చర్చలోకి వస్తోంది. మొన్నా మధ్య రియాసేన్ తన భర్తతో హనీమూన్ ఫోటోలను నెట్ లో షేర్ చేసింది. అదొక హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇలియానా ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో ముద్దులాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ‘a moment in a world of madness’ అనే కామెంట్ తో ఇలియానా ఈ ఫోటోను పోస్ట్ చేసింది. మరి ఈ షాట్ దగ్గరగా లేకపోయినా.. ఫోటో చాలా బాగుందని, ఇలియానా నువ్వు చాలా హాట్ అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.