మహేష్ ‘స్పైడర్’ ముంబైలో చూస్తాడట!

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘స్పైడ‌ర్’ కు సెన్సార్ టీమ్ ప్రశం స‌ల జ‌ల్లు కురిపించింది. మ‌హేష్ మ‌రోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం షురూ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. దీంతో మ‌హేష్ ప్రేక్ష‌కాభిమానుల్లో అంచ‌నాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు షురూ అని అభిమానులు గంటా ప‌ధంగా చెబుతున్నారు. 
 
ఇలాంటి ఒత్తిళ్ల న‌డుమ మ‌హేష్ హైద‌రాబాద్ లో సినిమా చూడ‌టం అనేది  క‌ష్టం. అందుకే మ‌హేష్- ముర‌గ‌దాస్ కలిసి అభిమానుల‌తో ముంభైలో ఓ థియేట‌ర్ లో సినిమా చూడ‌నున్నార‌ని మ‌హేష్ స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. వాస్త‌వానికి మ‌హేష్ ఒక్క‌డే ఎప్పుడూ ముంభైలో కామ‌న్ మ్యాన్ గా సినిమా చేసేవాడు. అయితే కొద్ది కాలంగా అక్క‌డ సినిమాలు చూడ‌టం త‌గ్గించిన‌ట్లు తెలిసింది. మ‌ళ్లీ స్పైడ‌ర్ తో పాత పద్ధ‌తికి వెల్ క‌మ్ చెబుతున్న‌ట్లున్నాడు.