‘రంగస్థలం’ సెన్సార్ రిపోర్ట్!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం ‘రంగస్థలం’. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. 1985 కాలం నాటి కథతో వస్తున్న ఈ రంగస్థలం సినిమాలో రాం చరణ్ చిట్టిబాబు చెవిటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత రామలక్ష్మిగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.ఇక సెన్సార్ రివ్యూ మాత్రం సినిమా పక్కా హిట్ బొమ్మ అన్నట్టు టాక్ వచ్చింది. రామ్ చరణ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. చిట్టిబాబు పాత్రలో చరణ్ మేకోవర్ ఫ్యాన్స్ కు సర్ప్రైజింగ్ గా ఉంటుందట. చాలా కాలం తరువాత ఓ మంచి సినిమా చుసామనే తృప్తి కలిగిందని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారట. యు/ఏ సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా ఈ నెల ౩౦న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.