HomeTelugu Big Stories'మ‌ర‌క‌త‌మ‌ణి' మోషన్ పోస్టర్!

‘మ‌ర‌క‌త‌మ‌ణి’ మోషన్ పోస్టర్!

ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగ‌ర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘మ‌ర‌క‌త‌మ‌ణి’. శ్రీరామనవమి కానుకగా సినిమా మోషన్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. త‌మిళం లో రెండు సూప‌ర్‌ హిట్ చిత్రాల‌కి వ‌ర్క్ చేసిన శ‌ర్వ‌న‌ణ్ ద‌ర్శ‌కత్వం చేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో స‌మ్మ‌ర్ లో విడుద‌ల‌కి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ”ఈ చిత్రం చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుండ‌ట‌మే కాకుండా అడ్వంచ‌ర్ ఘెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ గా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ఈ చిత్రానికి క‌బాలి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు సంతోష్ నారాయ‌ణ్ అసిస్టెంట్ దిబు థామ‌స్ తొలిసారిగా మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే క‌బాలి సింగ‌ర్ అనిల్ కామ‌రాజ్ ఈ చిత్రంలో న‌టించ‌టం తో పాటు ఓ సూప‌ర్ సాంగ్ పాడారు. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఓకేసారి విడుద‌ల చేస్తున్నాము. కొటా శ్రీనివాస‌రావు గారు ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే సూప‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం గారు న‌వ్వులు కురిపించారు. ఈ చిత్రం అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తుందన‌టంలో సందేహం లేదు” అన్నారు.
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu