రవితేజ భలే తప్పించుకున్నాడు!

ఒక్కోసారి కొంతమంది ఫ్లాపుల నుండి భలే తప్పించుకొని సేవ్ అయిపోతుంటారు. సినిమా హిట్ కాదని ముందే గ్రహించి సున్నితంగా సినిమాను రిజెక్ట్ చేస్తారు. రవితేజ కూడా రీసెంట్ గా ఓ ఫ్లాప్ నుండి అలానే తప్పించుకున్నాడు. ఈ ఏడాదిలో వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. నిజానికి ఈ సినిమాలో హీరోగా రవితేజ నటించాల్సివుంది. కానీ ఆయన నో చెప్పడంతో ధరం తేజ్ తో ఈ సినిమాను పూర్తి చేసారు. గతంలో వినాయక్-రవితేజ కాంబినేషన్ లో ‘కృష్ణ’ అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ‘ఇంటెలిజెంట్’ కథను ముందుగా రవితేజకు వినిపించాడు వినాయక్. అయితే సినిమా చేయనని చెప్పకుండా నేను పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి కొద్దిరోజులు వెయిట్ చేస్తారా..? అని వినాయక్ ను అడిగారట. అప్పుడు వినాయక్ కు ఎదురుచూసే సమయం లేకపోవడంతో ధరం తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆ విధంగా రవితేజ ఈ ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడన్నమాట.