ఆ ఫోటో వెనుక స్టోరీ ఆదేనా..?

రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో సన్నిహితంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరిద్దరితో కలిసి రాజమౌళి సినిమా చేయబోతున్నడంటూ వార్తలు వినిపించడం మొదలుపెట్టాయి. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. పైగా ఇప్పట్లో ఈ ఇద్దరి హీరోల డేట్లు ఒకేసారి దొరకడం అంటే చాలా కష్టమైన విషయం. ఈ క్రమంలో రాజమౌళి ఈ ఫోటో షేర్ చేయడం వెనుక అసలు కారణం ఏంటని మరో కోణంలో ఆలోచిస్తే.. కావాలనే ఆయన ఈ ఫోటో రివీల్ చేశాడని అనిపిస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో కమ్మ, కాపు అంటూ కులాల ప్రస్తావన వస్తోంది. దీంతో కమ్మ, కాపు హీరోల మధ్య ఎలాంటి తారతమ్యం లేదని పరోక్షంగా చెప్పడానికే ఆయన ఈ రకంగా ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు. ఏదేమైనా.. సరే ఈ ఫోటో మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.