‘లవర్‌’ టీజర్‌

యువ నటుడు రాజ్‌తరుణ్, రిధి కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవర్‌’.ఈ చిత్రానికి అనీశా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ సమర్పిస్తోంది. హర్షిత్‌ రెడ్డి నిర్మాత. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.

ఈ ప్రచార చిత్రం ‘వాట్‌ యాన్‌ అమ్మాయి మచ్చా.. మైండ్‌బ్లోయింగ్‌’ అనే డైలాగ్‌ తో మొదలౌతుంది. టీజర్‌లో రాజ్‌తరుణ్‌ తన ప్రేమ గురించి స్నేహితులకు గొప్పగా వర్ణిస్తున్నారు. వాళ్లేమో.. ‘కొంచెం ఓవర్‌ చేస్తున్నట్లు లేదా?’ అని ఆయన్ను తిరిగి ప్రశ్నించారు. దీనికి ‘అస్సలు లేదు’ అని బదులిస్తాడు. ఒకప్పుడు గ్రేట్‌ లవర్‌‌ స్టోరీస్‌ చెబుతుంటే నేను కూడా చాలా ఓవర్‌గా చెబుతున్నారు అనుకునేవాడ్ని మచ్చా.. కానీ ఇప్పుడు చెప్తున్నా, అప్పట్లో వాళ్ల ఫీల్‌ ఇప్పుడు నేను ఫీల్‌ అవుతున్నా’అని రాజ్‌తరుణ్‌ చెబుతూ కనిపించారు. ‘నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవు’ అని హీరోయిన్‌తో చెప్పే సన్నివేశం ఫన్నీగా ఉంటుంది.