వేదికకు బాలీవుడ్ ఆఫర్

హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ హర్రర్ మూవీ “ముని”లో హీరోయిన్‌గా చేసిన వేదిక ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ఆ తర్వాత ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాలు చేస్తున్న వేదికకు తాజాగా బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. ఈ సినిమాలో ఓ ఇన్నోసెంట్‌ కాలేజీ అమ్మాయిగా నటించబోతుంది.

మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ ఇమ్రాన్ హష్మితో రూపొందిస్తున్న ‘ది బాడీ’ హిందీ సినిమాలో వేదికను హీరోయిన్‌గా తీసుకున్నారు. బాలీవుడ్‌లో ఫస్ట్ మూవీలోనే ఇమ్రాన్ హష్మి, రిషికపూర్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇన్ని రోజులు ఎదురుచూసినందుకు ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్టు రావడం చాలా ఆనందంగా ఉంది అంటోంది. స్పానిష్ కిల్లర్ మూవీ ‘ది బాడీ’ కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని సునీల్ కేటర్‌పాల్ నిర్మిస్తున్నారు. ముంబైలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం తదుపరి షూటింగ్ కోసం మారిషస్ వెళ్లబోతుంది.