శృతిని ఏమని పిలిచేవారో తెలుసా..?

బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చెబుతుంటారు. అది నమ్మి శృతి రోజూ బెండకాయలు తినడం అలవాటు చేసుకుందట. ఎంతగా అంటే అందరూ ఆమెను బెండకాయక్కా అని పిలిచేంతగా.. ”చిన్నప్పటి నుండి నాకు లెక్కలు సరిగ్గా వచ్చేవి కాదూ.. దీంతో బెండకాయలు తింటే తెలివి పెరుగుతుందని తెగ తినేదాన్ని. దాంతో అందరూ నన్ను ‘వెండకాక్కా’ తెలుగులో బెండకాయక్కా.. అని పిలిచేవాళ్లు. నేను అంతగా తిన్న ఫలితం లేకపోయేది. స్కూల్ డేస్ లో వందకి 26 మాత్రమే
నాకు లెక్కల్లో నాకు వచ్చిన అత్యధిక మార్కులు.ఓసారైతే మరే దారుణం 2 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇప్పటికీ నేను లెక్కల్లో వీకే” అని తెలిపారు శృతిహాసన్. ప్రస్తుతం ఆమె నటించిన ‘కాటమరాయుడు’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.