సమంత “యు టర్న్”

“హమ్ ఫిట్‌తో హై ఇండియా ఫిట్” కాన్సెప్ట్‌లో భాగంగా సమంత ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. “క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌ వల్లే ఏర్పడతాయి.. నా దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఆకర్షణగా కనిపించేందుకు చేసే కసరత్తు మాత్రమే కాదు” అన్నారు అక్కినేని సమంత. ఈ ఛాలెంజ్ నాకు చాలా బాగా నచ్చింది. మనసుకు, కళ్లకు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని తెలిపింది. ఆమె ఫిట్‌నెస్ కోసం ఎంత ప్రాముఖ్యతనిస్తారో దీన్నిబట్టే తెలుస్తుంది. 10 కిలోల బరువును వీపుమీదుంచుకుని ఎక్సర్‌సైజ్ చేశారు సమంత. సినిమాల విషయంలోనే కాకుండా ఫిట్‌నెస్ విషయంలోనూ ఆమె అంకిత భావం వెల్లడవుతోంది.

ప్రస్తుతం యూటర్న్‌ సినిమాలో సమంత బిజీగా ఉంది. కన్నడలో క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ “యూ టర్న్” అదే పేరుతో తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడలో రూపొందించిన పవన్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.