బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్న నటి

శ్వేతా బసు ప్రసాద్‌ ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు. తర్వాత ‘కాస్కో’, ‘రైడ్‌’, ‘కళావర్‌ కింగ్‌’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో సందడి చేశారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నశ్వేతా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలిసింది. పెళ్లి తర్వాత అదే వారంలో ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారట. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం శ్వేత బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందు కోసం ఆమె తన స్నేహితులు, కాబోయే భర్తతో కలిసి ఇండోనేషియాలోని ద్వీపం బాలికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలను కాబోయే కాబోయే పెళ్లి కూతురు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు.

ఈ సందర్భంగా శ్వేత స్నేహితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘శ్వేత, రోహిత్‌ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. త్వరలో వారి పెళ్లి జరుగుతుండటం సంతోషంగా ఉంది. ముందు అబ్బాయే అమ్మాయికి ప్రపోజ్‌ చేయాలనే రోజులు పోయాయి. ముందు శ్వేత గోవాలో తన ప్రేమను రోహిత్‌కు తెలిపింది. తర్వాత రోహిత్‌ పుణెలో ఆమెకు ప్రపోజ్‌ చేశారు’ అని చెప్పారు.

View this post on Instagram

Let. The. Bachelorette. Begin!

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on