సాయి పల్లవికి పెళ్లంట!

టాలీవుడ్‌ లోకి ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చి అందర్ని ఫిదా చేసిన నటి సాయి పల్లవి..దీంతో తెలుగుతో పాటు దక్షిణాది భాషలలోనూ పలు చిత్రాలలో నటిస్తున్నది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి త్వరలో వివాహం చేసుకోనుందనే వార్త ఇప్పడు హాట్‌ టాపిక్‌ గా మారింది. దక్షిణాదికి చెందిన సినీ నేపథ్యం ఉన్న మంత్రి కొడుకు సాయిపల్లవిని ప్రేమించేశాడట. ఇదే విషయాన్ని స్వయంగా అతడే సాయి పల్లవికి చెప్పాడట. అయితే సన్నిహితంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది సాయి పల్లవి..కథ ముగిసిపోయిందని అనుకుంటున్న సమయంలో సాక్షాత్తు మంత్రి సాయి పల్లవి తల్లిదండ్రులను కలిసి తన కుమారుడికి సాయి పల్లవిని ఇచ్చి వివాహం చేయమని కోరారట.. దానితో ఏం చేప్పాలో వారికి అర్థం కాక తర్వాత చూద్దాం అన్నారట..అయినా వినకుండా ముందు నిశ్చితార్థం చేసుకుందాం పెళ్లి తర్వాత చేద్దాం అన్నారట ఆ మంత్రి.

 

ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆలోచిద్దాం అంటూ సున్నితంగా సమాధానం చెప్పి ఆ మంత్రిని పంపిచేశారట.మంత్రి స్వయంగా వచ్చి అడగడంతో సాయి పల్లవికి ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. అయితే పల్లవి ఇంత వరకూ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందని సమాచారం.