సినీ సన్యాసం మాటలు వరకే!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత దాన్ని వదులుకొని బయటకు వెళ్ళడం అనేది చాలా కష్టం. దానికున్న గ్లామర్ అలాంటిది. మేకప్, షూటింగ్ అలవాటు అయిన వారు సినిమాలను వదులుకునే చాన్సే లేదు. కానీ ఈ మధ్య మన స్టార్లు రాజకీయాల్లో బిజీ అవుతూ సినిమాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ లిస్టులో ముందుగా వినిపించేది పవన్ కళ్యాణ్ పేరు. తాజాగా నటుడు కమల్ హాసన్ కూడా సినిమాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. కానీ ఇది జరిగే పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఇకపై సినిమాలు చేయను.. రాజకీయాల్లోనే పూర్తిగా నిమగ్నమవుతానని అన్నారు. కానీ ఏమైంది..? ఖైదీ నెంబర్ 150 అంటూ రీఎంట్రీ ఇచ్చారు. మరో రెండు, మూడేళ్ళ పాటు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొన్నటివరకు సినిమాలు చేయనని చెప్పిన పవన్ మరో రెండు నెలల్లో కొత్త సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కమల్ హాసన్ చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తయితే సినీసన్యాసం తీసుకుంటానని అన్నారు. కానీ ఆ మాటపై ఎంతవరకు నిలబడతారో చూడాలి!