క్రికెటర్‌తో ఎఫైర్‌ వార్తలపై తమన్నా స్పందన.. ఆయనే బెటర్..!

“ఎఫ్2” సినిమా విజయం తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సంక్రాంతికి విడుదలైన ఎఫ్‌-2 సినిమా దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్నా ప్రస్తుతం “క్వీన్” తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మి”సినిమాలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది. వీటితో పాటు రెండు తమిళ, ఓ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది తమన్నా. కొన్నేళ్ల కిందట టీమిండియా క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లతో హీరోయిన్ తమన్నా డేటింగ్ చేస్తుందంటూ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ రుమార్స్‌పైన విరాట్ కోహ్లీగానీ, తమన్నా గానీ రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి, పెళ్లి కూడా చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో విరాట్‌తో ఎఫైర్‌పై ప్రశ్నలు వేయగా.. ఆ విషయంపై మొదటిసారిగా తమన్నా స్పందించింది. తాను విరాట్‌ కోహ్లీతో కలిసి గతంలో ఓ యాడ్‌లో పనిచేశానని. ఆ తర్వాత మళ్లీ కోహ్లీని ఇంతవరకు కలవలేదని, కోహ్లీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనతో డేటింగ్‌ చేయలేదని సమాధానమిచ్చింది తమన్నా.

సినిమా హీరోల కంటే విరాట్ కోహ్లీ చాలా బెటరని తమన్నా అంటోంది. హీరోలతో పోలుస్తూ కోహ్లీని పొగడటం బాగోలేదంటూ హీరోల అభిమానులు కామెంట్ చేస్తున్నారు తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో పాటు విక్టరీ వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతోనూ జతకట్టిందీ మిల్కీబ్యూటీ. బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి వారితో కలిసి నటించిన తమన్నాకు ఎక్కడ, ఎవరితో చేదు అనుభవం ఎదురైందోనని ఆలోచిస్తున్నారు తమన్నా ఫ్యాన్స్.