సీక్వెల్ కథ రెడీనా..!

అక్కినేని నాగచైతన్య-సమంత జంటగా నటించిన “ఏమాయ చేశావే” చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు గౌతమ్‌ మీనన్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూనే ఉంది. అందమైన జెస్సీతో దర్శకుడు కావాలని కలలుగనే కార్తీక్ ప్రేమలో పడ్డాక ఆ ప్రేమ కథ ఎన్నిమలుపులు తిరిగిందన్నదే కథాంశం.

ఏ మాయ చేసావే విడుదలైన 8 ఏళ్ల తర్వాత సీక్వెల్ కథాంశాన్ని సిద్ధం చేశాడు దర్శకుడు గౌతమ్‌ మీనన్. రోడ్ ట్రిప్ నేపథ్యంలో కథ సిద్ధం చేశాడట. జెస్సీతో లవ్ చెడిపోయాక.. తన స్నేహితుడి పెళ్లికి వెళతాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో జరిగిన సంఘటనల ఆధారంగా సీక్వెల్ కథను సిద్ధం చేశాడట
గౌతమ్.