విజయ్ మూడో పాత్ర ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘మెర్సల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు విడుదల చేయబోతున్నారు. ‘రాజా రాణి’,’పోలీసోడు’ వంటి చిత్రాలతో దర్శకుడు అట్లీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ దర్శకుడికి విజయ్ మరో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విజయ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించాడు. అందులో ఒకటి జల్లికట్టు వీరుడి పాత్ర కాగా, మరొకటి ఇంద్రజాలికుడు అని ఇతీవల విడుదల చేసిన పోస్టర్స్ ద్వారా అర్ధమవుతోంది.
అయితే ప్రస్తుతానికి మూడో పాత్రను సస్పెన్స్ గానే పెట్టాడు దర్శకుడు. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ ఆ పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్. ప్రజలకు సేవ చేసే నాయకుడిగా అట్లీ ఆ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి ఓ క్యారెక్టర్ సాంగ్ ను కూడా ఇటీవల చిత్రీకరించారని తెలుస్తోంది. 
మూడు పాత్రలకు తగ్గట్లుగా ఈ సినిమా కాజల్, సమంత, నిత్యమీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.