HomeTelugu Reviewsఆట‌గాళ్లు మూవీ రివ్యూ

ఆట‌గాళ్లు మూవీ రివ్యూ

కెరీర్‌ మొదటి నుంచి కథల ఎంపికలో నారా రోహిత్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో నారో రోహిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్ళు సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జగపతి బాబు కూడా ఈ మధ్య చాలా వరకు కీలకమైన పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పరుచూరి మురళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్‌ విడుదలయిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఎంతవరకు రీచ్ అయ్యిందో, కమర్షియల్‌గా ఎంత వరకు సక్సెస్ సాధించగలదో చూడాలి మరి.

1 39

కథ
సినిమా దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్) ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్ చేయాలనేది అతని కల. అదే పనిలో ఉండగా అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి పెళ్లయిన కొద్దిరోజులకే అంజలిని ఎవరో హత్య చేస్తారు. భార్యను తనే చంపాడని ఆ నేరం సిద్ధార్థ్‌పై పడుతుంది. ఫలితంగా జైలుకు వెళ్తాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) ఈ కేసును వాదిస్తాడు. జడ్జి అనుమతితో సిద్ధార్థ్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తాడు. సిద్ధార్థ భార్యను తనే హత్యచేశాడా? వీరేంద్ర దర్యాప్తులో ఏం తేలుతుంది? వీరేంద్రకు సిద్ధార్థ్ ఏం చెప్పాడు? వీరిద్దరి మధ్య జరిగిన ఆటలో గెలుపెవరిది అనే అంశాలతో మిగతా కథ ఉంటుంది.

1a 1

నటీనటులు
ఎవ‌రెలా చేశారంటే: ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు లుక్‌, ఆయ‌న హావ‌భావాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. నారా రోహిత్ కూడా సిద్ధార్థ్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఆయ‌న పాత్ర ప్రేక్ష‌కులకి థ్రిల్‌ని పంచుతుంది. గాఢ‌త‌తో కూడిన న‌ట‌నని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు రోహిత్‌. ద‌ర్శ‌న‌బానిక్ అందంతో ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మానందం ద్వితీయార్ధంలో కూడా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు కానీ, ఆ స‌న్నివేశాలు అంతగా పండ‌లేదు.

జగపతి బాబు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సూపర్బ్ అనిపించారు. ఆయన లుక్, హావభావాలు సినిమాకు హైలైట్. మరోసారి తన మార్క్‌ చూపించారు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు వాదించే లాయర్‌గా జగపతిబాబు ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు రొమాంటిక్‌ లవర్ బాయ్‌గా కనిపించిన నారా రోహిత్ సీరియస్ లుక్‌లోనూ అదరగొట్టాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిద్ధార్థ్ పాత్ర ప్రేక్షకులకు థ్రిల్ పంచుతుంది. హీరోయిన్‌ దర్శనబానిక్‌ కథా పరంగా కీలక పాత్రే అయినా నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా తన అందంతో ఆకట్టుకుంది. గ్లామర్‌ షోతో మంచి మార్కులు సాధించింది. కామెడీ కింగ్ బ్రహ్మానందం చాలా కాలం తర్వాత మంచి పాత్ర దక్కింది. తన పాత్రకు తగ్గ న్యాయం చేశాడు. పోలీస్ అధికారిగా సుబ్బరాజు నటనతో ఆకట్టుకున్నాడు. ఇంకా ఇతర పాత్రల్లో తులసి, శ్రీతేజ్, జీవా తదితరులు తమ పాత్ర మేరకు నటించారు.

1b 1

విశ్లేషణ
కమర్షియల్ చిత్రాలతో పాటు కుటుంబ క‌థా చిత్రాలను తెర‌కెక్కించి మెప్పించిన ప‌రుచూరి ముర‌ళి, ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. ఆయ‌న క‌థ సిద్ధం చేసుకొన్న విధానం, పాత్ర‌ల్ని తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఈ త‌ర‌హా చిత్రాల‌కి గ్రిప్పింగ్‌గా సాగే క‌థ‌నం చాలా ముఖ్యం. ఆ విష‌యంలోనే ప‌రుచూరి ముర‌ళి తడబడినట్లు అనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సాయికార్తీక్ నేప‌థ్య సంగీతం, విజ‌య్ సి.కుమార్ కెమెరా ప‌నిత‌నం క‌థ‌కి బ‌లాన్నిచ్చాయి. సాంకేతికంగా సినిమా బాగుంది.

ఈ చిత్రంలో హీరో నారా రోహిత్, జగపతిబాబు వారి నటనతో సినిమా స్థాయిని పెంచేశారు. ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అసలు కథ మొదలవడానికి చాలా సమయం పడుతుంది. ఇద్దరు తెలివైన వ్యక్తుల మధ్య సాగే ఆట ఆసక్తికరంగా ఉంటుంది. ఎత్తులకు పైఎత్తులతో సాగే సన్నివేశాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథలో లీనమయ్యేలా చేస్తాయి. జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ మ‌ధ్య స‌న్నివేశాల కోసం ద‌ర్శ‌కుడు బాగా క‌స‌ర‌త్తు చేశారనిపిస్తుంది. మొత్తం సినిమా అదే తరహాలో నడిపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో మలుపులు ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ ప్రేక్షకుడికి పూర్తి వినోదం పంచుతుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ కాస్త రిలీఫ్ అనిపిస్తుంది.

హైలైట్స్
నారా రోహిత్, జగపతిబాబు నటన
జ‌గ‌ప‌తిబాబు లుక్‌, హావ‌భావాలు
కథ, నేపథ్య సంగీతం

డ్రాబ్యాక్స్
ఫస్ట్ హాఫ్‌లో సాగదీతగా ప్రేమ సన్నివేశాలు
లాజిక్ మిస్సైన సన్నివేశాలు

చివరిగా : రఫ్ఫాడించలేకపోయినా.. ఆట బాగుంది
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

చిత్రం: ఆటగాళ్లు
న‌టీన‌టులు: నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, సుబ్బరాజు, ద‌ర్శ‌న బానిక్ త‌దిత‌రులు
సంగీతం: సాయికార్తీక్‌
ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి
నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్, రాము మ‌క్కెన‌, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌
సంస్థ‌: ఫ్రెండ్స్‌ అండ్ క్రియేష‌న్స్
ఛాయాగ్ర‌హ‌ణం: విజ‌య్ సి కుమార్

Recent Articles English

Gallery

Recent Articles Telugu

కెరీర్‌ మొదటి నుంచి కథల ఎంపికలో నారా రోహిత్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో నారో రోహిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్ళు సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జగపతి బాబు కూడా ఈ మధ్య చాలా వరకు కీలకమైన పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత...ఆట‌గాళ్లు మూవీ రివ్యూ