చిరు తరువాత అంతటి పాత్ర జగపతికే!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సై.. రా నరసింహారెడ్డి’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. అయితే సినిమాలో చిరంజీవి తరువాత అంతటి సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర జగపతిబాబుకి దక్కినట్లుగా తెలుస్తోంది. హీరో నుండి విలన్ గా టర్న్ అయి వరుస సక్సెస్ లను అందుకుంటున్న జగపతిబాబు ఈ సినిమాలో కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 
నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడుగా జగపతి బాబు పాత్ర ఉంటుందట.
నరసింహారెడ్డిని నమ్మించి బ్రిటీష్ వారికి పట్టించడానికి కారణభూతుడయ్యే పాత్రలో జగపతి కనిపించబోతున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోలతో ఇప్పటివరకు జగపతి ఏ సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడం అతడికి ఆనందాన్ని కలిగిస్తోంది.