HomeTelugu Newsఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ మూవీ అర‌వింద స‌మేత రాఘ‌వ‌

ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ మూవీ అర‌వింద స‌మేత రాఘ‌వ‌

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదల చేసారు. ఎన్టీఆర్ న్యూలుక్ అదిరింది. గ‌తంతో పోలిస్తే ఒక్క టెంప‌ర్ లో మాత్ర‌మే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో క‌నిపించారు. ఆ త‌రువాత వ‌చ్చిన నాన్న‌కు ప్రేమ‌తో, జ‌నతా గ్యారేజ్, జై ల‌వ‌కుశ చిత్రాల‌లో అలాంటి లుక్ మ‌న‌కు క‌నిపించలేదు. మ‌ర‌లా త్రివిక్ర‌మ్ సినిమా కోసం బాడీ బిల్టింగ్ చేశాడు. దీని కోసం తార‌క్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడట‌.

11

ఈ చిత్రం రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌ తో రానుంది అని చెబుతున్నారు. దీనికి త‌గిన విధంగానే ”అర‌వింద స‌మేత రాఘ‌వ” చిత్రం ఫ‌స్ట్ లుక్ లో ఎన్టీఆర్ క‌త్తి ప‌ట్టుకున్ని ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ ఫ‌స్ట్ లుక్ తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సినిమా మాస్ ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర కానుంది. టైటిల్ ప‌రంగా క్లాస్ గా ఉంది. అస‌లు ఈ క‌థ ఏ త‌ర‌హాకు చెందినదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu