HomeTelugu Newsఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు నన్ను పంపాలని చూసింది

ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు నన్ను పంపాలని చూసింది

ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు తనను పంపాలని చూసిందని అంటూ క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’ లిరిసిస్ట్‌ శ్రేష్ఠ. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానంటూ తన పట్ల జరిగిన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

3 14

‘చిత్ర పరిశ్రమలో నాకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్ల కెరీర్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కేవలం రచయిత్రిగానే చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించుకోలేవని చాలా మంది చెప్పేవారు. మగవారే కాదు ఆడవారు కూడా లైంగిక వేధింపులకు పాల్పడతారని తెలుసుకున్నాను. ఓసారి నిర్మాత భార్యే తన భర్త వద్దకు నన్ను పంపాలని చూసింది. మరో ఘటనలో.. ఓ వ్యక్తి నన్ను చూసి ఇష్టపడ్డాడని నాకు ప్రపోజ్‌ చేయడానికి గోవాలో పార్టీ ఏర్పాటుచేశాడని ఓ మహిళా దర్శకురాలు నాతో చెప్పింది. కానీ నేను ఆమె మాటలు విని వెళ్లలేదు. దాంతో ఆ వ్యక్తి నాకు ఫోన్‌ చేసి దారుణంగా తిట్టాడు. ఆ సమయంలో నిస్సహాయస్థితిలో ఉన్నాను. ఆ తర్వాత నాతో ఇలా ప్రవర్తిస్తున్న వారిని హెచ్చరించి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను.’ అని తెలిపారు.

‘మధురం మధురం’ ‘యుద్ధం శరణం’ చిత్రాలకు కూడా శ్రేష్ఠా గేయ రచయిత్రిగా పనిచేసి ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu