HomeTelugu Reviewsకాశీ మూవీ రివ్యూ

కాశీ మూవీ రివ్యూ

సినిమా : కాశి
నటులు : విజయ్ ఆంటోనీ, అంజలి, సునయన, యెగి బాబు, జయప్రకాష్
సంగీతం : విజయ్ ఆంటోనీ
డైరెక్టర్ : కృతిగ ఉదయ నిధి
బ్యానర్ : ఎమోషనల్ డ్రామా

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఆ తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో
విడుదల చేస్తున్నాడు. బిచ్చగాడు సినిమా తర్వాత అంతటి విజయం సాధించలేకపోయాడు. మరోసారి మదర్ సెంటిమెంట్
ప్రధానంగా తెరకెక్కిన కాశీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటికే 7 నిమిషాల సన్నివేశాలు ముందుగా సోషల్
మీడియాలో విడుదల చేసి సినిమాపై ఆసక్తిని రేపాడు. ఈ సినిమాతో తెలుగులో మరో విజయం సాధించడం
ఖాయమనిపిస్తోంది.

7

కాశీ మూవీ రివ్యూలోకి వెళ్తే హీరో విజయ్ ఆంటోనీ (భరత్) అమెరికాలో డాక్టర్. అన్నీ వున్నా భరత్ ఏదో పోగొట్టుకున్న
భావన తనను వేధిస్తుంటోంది. తనకు చిన్నప్పటి నుంచి ఓ కల వస్తుంటుంది. ఆ కలలో చిన్న పిల్లాడిని ఎద్దు
పొడుస్తున్నట్లు పాము కాటెయ్యబోతుండగా ఎద్దు పారిపోతున్నట్లు కలలోకనిపిస్తుంటుంది. ఇన్నాళ్లు తనను పెంచింది సొంత
తల్లిదండ్రులు కాదని తెలుస్తుంది. తనకు రోజూ వచ్చే కలకు తన తల్లిదండ్రులకు ఏదో సంబంధముందని వారిని
వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు.

ఇండియాలోని ఓ అనాథ ఆశ్రమంలో తన తల్లిపేరు పార్వతి అని ఆమె భరత్ చిన్నప్పుడే చనిపోయిందని , భరత్ అసలు
పేరు కాశి అని, సొంతూరు కంచర్లపాలెం అని తెలుసుకుని తన తండ్రికోసం ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ తన తండ్రిని
కలుసుకున్నాడా.. అసలు తల్లిదండ్రులకు కాశి ఎందుకు దూరమయ్యాడు.. తన ప్రయత్నంలో విజయం సాధించాడా.. ఆ
తర్వాత జరిగిన ఘటనలు ఏమిటనేది మిగతా కథ.

8

మొత్తం సినిమా అంతా హీరో తన భుజంపైనే వేసుకుని నడిపించాడు. నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించాడు.
కానీ నాలుగు పాత్రలు రోటీన్ గా ఉన్నట్లు అనిపిస్తాయి. హీరో ఫ్రెండ్ గా నటించిన యోగిబాబు కామెడీని పండించే ప్రయత్నం
చేశాడు. హీరోయిన్ అంజలి దాదాపు అతిథి పాత్రకే పరిమితమైంది. మరో హీరోయిన్ సునయన తన పాత్రకు న్యాయం
చేశారు. మరో కీలక పాత్రలో జయప్రకాష్ నటించారు. బిచ్చగాడు సినిమాలో మదర్ సెంటిమెంట్ తో విజయం సాధించిన
విజయ్ ఆంటోనీ మరోసారి అదే సెంటిమెంట్ ను నమ్ముకున్నాడు.

చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరమై పెద్దయిన తర్వాత తిరిగి తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ చేసే ప్రయాణే కాశీ కథ.
కాన్సెప్ట్ బాగున్నా అసలు కథను పక్కన పెట్టి ఉప కథలు జోడించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది దర్శకురాలు. తన తల్లి
చనిపోయిందని తెలుసుకునే వరకు కథ బాగానే ఉంది. పూర్తిగా తమిళ నటులు, తమిళ నేటివిటీతో తెరకెక్కడం కూడా
తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే అంశమే. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో నటించేందుకు
చాలా కష్టపడ్డాడు. లవ్, సెంటిమెంట్, రొమాన్స్ సరిగా క్యారీ చేయలేదనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది.

విజయ్ సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ ఆంటోనీ
సినిమా అంటే కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు అంతగా మెప్పించలేదనే చెప్పాలి.
(ఈ రివ్యూ కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu