HomeTelugu Newsకేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఈ చానెలేనా?

కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఈ చానెలేనా?

అధికారంలో కలకాలం ఉండాలని ఆశపడే రాజకీయ నేతలు మొదట చేసే పని ఏంటో తెలుసా.? ప్రతిపక్షాలు.. బలమైన మీడియాను కూకటివేళ్లతో పెకిలించాలని చూడడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ ను లేకుండా చేయడంలో కేసీఆర్ కొంత వరకు సక్సెస్ అయ్యారు. ఈ పార్లమెంట్ ఎన్నికలను మినహాయిస్తే కేసీఆర్ ప్లాన్లన్నీ సక్సెస్ అయ్యాయి.

KCR Fires On Congress and BJP

అందుకే ఇప్పుడు కేసీఆర్ ఆపరేషన్ మీడియా చేపట్టారు. మొదట కొరకరాని కొయ్యగా మారిన టీవీ9 రవిప్రకాష్ ను ఆ గ్రూపు నుంచి దిగ్విజయంగా పంపించివేశారు. నిజానికి రవిప్రకాష్ చేసిన పనులే ఆయన్ను బయటకు పంపేలా చేశాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడం.. దాన్ని చాలా రోజుల తర్వాత రవిప్రకాషే స్వయంగా తెరపైకి వచ్చి డిబేట్లు పెట్టి రచ్చ చేయడంతో కేసీఆర్ దృష్టి ఆయనమీద పడింది. ఇంకేముందు తెరవెనుక తన సన్నిహిత పారిశ్రామికవేత్తలతో చక్రం తిప్పి టీవీ9లో వాటాలు కొనిపించి రవిప్రకాష్ ను పంపించివేశారన్న చర్చ రాజకీయ, మీడియా వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.

రవి ప్రకాష్ ఖేల్ ఖతమైంది. కేసుల్లో చిక్కి అరెస్ట్ ముంగిట ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అంటే అందరూ చెబుతున్న మాట.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏండీ రాధాకృష్ణనే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబుకు సపోర్టుగా రాధాకృష్ణ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. కాంగ్రెస్ గెలుస్తుందని.. లగడపాటి సహా సర్వేలన్నీ వండి వార్చి హైప్ తెచ్చారు. ఇవన్నీ నమ్మి కేటీఆర్ కూడా తమకు ఓటమి తప్పదా అని అనుకున్నాడట.. మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన చంద్రబాబు.. ఆయన అనుకూల రెండు పత్రికలు.. పదుల టీవీ చానెల్స్ తెలంగాణ.. మొన్నటి ఆంధ్రా ఎన్నికల వేళ కేసీఆర్, జగన్ లను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అవాస్తవాలు ప్రసారం చేశాయి. 2014లో వలే ఇప్పుడు వర్కవుట్ అవుతుందని అనుకున్నాయి.కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

అందుకే ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయాయి టీడీపీ అనుకూల మీడియా.. అటు ఏపీలో జగన్. ఇటు తెలంగాణలో కేసీఆర్.. పోనీ కాంప్రమైజ్ చేసుకుందామా అంటే వారిద్దరూ వినే రకం కాదు.. గండరగండరలు.. అయినా వారిని టీడీపీ మీడియా మామూలుగా గెలకలేదు కదా.. ఎలా ఊరుకుంటారు.. అందుకే వచ్చే ఐదేళ్లు టీడీపీ అనుకూల మీడియాకు చుక్కలేనంటున్నారు..

ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద పడ్డట్టు టాక్. టీవీ9లో ఎలాగైతే మెజార్టీ వార్టీలు కొని రవిప్రకాస్ ను బయటకు పంపించారో.. ఇప్పుడు ఏబీన్ ఆంధ్రజ్యోతిలో కూడా వాటాదారులుగా ఉన్న వారిని బయటకు పంపి టీఆర్ఎస్ అనుకూల బడా పారిశ్రామికవేత్తలను అందులో కొనుగోలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేగనుక జరిగితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా టీఆర్ఎస్ చేతికి చిక్కడం ఖాయం. రాధాకృష్ణపై కేసీఆర్ ప్రతీకారం ఖాయం. కానీ మీడియాలో ఆరితేరిన జర్నలిస్టు అయిన రాధాకృష్ణ ఈ ఐదేళ్లు కేసీఆర్ ఎత్తులను ఎలా కాపాడుకుంటాడన్నది ఆసక్తిగా మారింది..

Recent Articles English

Gallery

Recent Articles Telugu