HomeTelugu Newsక్యాస్టింగ్‌ కౌచ్‌ లాంటివి నాకు ఎదురవలేదు.. ఆండ్రియా

క్యాస్టింగ్‌ కౌచ్‌ లాంటివి నాకు ఎదురవలేదు.. ఆండ్రియా

గాయనిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆండ్రియా. ఇటీవల తరమణిలో బోల్డ్‌ పాత్రలో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా ‘అవల్‌’ చిత్రంలో దెయ్యంగా కూడా నటించి అందర్నీ మెప్పించారు. తాజాగా ఆమె కమల్‌తో నటించిన ‘విశ్వరూపం 2’ శుక్రవారం విడుదలైంది. తన చిత్ర విశేషాల గురించి అమ్మడు ముచ్చటిస్తూ… “సినిమాల్లో నటించడానికి సంబంధించి ఎలాంటి షరతులు విధించడం లేదు. నాకు నచ్చినట్టు కథ ఉంటే వెంటనే అంగీకరిస్తున్నా. ఈ సంత్సరం ‘విశ్వరూపం 2’ ‘వడ చెన్నై’ వంటి రెండు పెద్ద చిత్రాలు నా ఖాతాలో చేరాయి. ఈ సినిమాలు తప్ప గత ఆరు నెలలుగా ఏ సినిమాల్లోనూ నటించేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం ‘వడ చెన్నై’ డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి.

6 9

ఇద్దరు కథానాయికలు ఉన్న సినిమాల్లో నటించడం వల్ల నా కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సినిమాలో నా పాత్ర ఎలాంటిదన్నది మాత్రమే నా ఆలోచన. నటన, సంగీతం రెండూ ఒకటే. ఎందులో అవకాశాలు ఎక్కువగా ఉంటే.. ఆ రంగాన్ని సద్వినియోగం చేసుకుంటా. క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి చెప్పే విషయాలు నిజమైతే… అలా చెప్పేందుకు కూడా చాలా ధైర్యం ఉండాలి. నాకు అలాంటి పరిస్థితులు ఎదురవలేదు. అలా ఎవరికి జరిగినా తప్పకుండా బయటి ప్రపంచానికి చెప్పడమే సరైన దారి. సంబంధిత వ్యక్తులను శిక్షించాల” ని పేర్కొంది ఆండ్రియా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!