HomeTelugu Newsజూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలవదు : రేణు దేశాయ్‌

జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలవదు : రేణు దేశాయ్‌

నటి రేణూ దేశాయ్‌ తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని సంభోదిస్తే వారిని సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని సున్నితంగా చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో అతడు సీరియస్‌గా దేని కోసమో వెతుకుతూ కనిపించారు.

5 15

‘నా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడు. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడు. (ఎవరైనా జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని కామెంట్‌ చేస్తే వారిని నా అసిస్టెంట్‌ డిలీట్‌ చేసి, బ్లాక్‌ చేస్తాడు). జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలవడం అకీరాకు, వాడి నాన్నకు, వాడి అమ్మనైన నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు అలా అనడం ఆపండి’ అని రేణు ఆ ఫొటోను పోస్ట్‌ చేస్తూ అన్నారు.

ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మిశ్రమ కామెంట్లు వచ్చాయి. ‘తల్లిగా మీ కుమారుడికి నచ్చని దాన్ని వద్దు అని చెప్పడం సరైనదే, ఈ విషయంలో మీకు మద్దతు చెబుతున్నా, అకీరా భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా, అతడికి హీరో కావడం ఇష్టం లేదా?..’ అంటూ కామెంట్లు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!