HomeTelugu Newsనాగశౌర్య రిస్క్ చేస్తున్నాడా?

నాగశౌర్య రిస్క్ చేస్తున్నాడా?

యంగ్ హీరో నాగశౌర్య నటించిన “అమ్మమ్మగారిల్లు” సినిమా రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా కుటుంబ నేపథ్యంలో వస్తున్నందున తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రం తర్వాత మరికొన్ని సినిమాలు లైన్లో పెట్టాడు నాగశౌర్య. తర్వాతి సినిమాల్లో “నర్తనశాల” ఒకటి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాగశౌర్య రిస్క్ చేసి గే తరహా పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

5 6

అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలా ప్రవర్తించే క్యారెక్టర్ ఉంటుందట. మొదట్లో ఈ కథ విన్న కొందరు హీరోలు ఈ తరహా పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని సమాచారం. కథ నచ్చడంతో నాగశౌర్య గే పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. నాగశౌర్య పాత్రను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. అతడి క్యారెక్టర్ ద్వారా కామెడీ పండించనున్నారట. ఈ సినిమా ద్వారా శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu