‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ రివ్యూ

నాగశౌర్య హీరోగా.. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఊహలు గుసగుసలాడే.. జ్యో అచ్యుతానంద చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అవసరాల.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు. ఆయన తీసిన తొలి రెండు సినిమాల్లో.. నాగశౌర్యనే హీరో. వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాల అన్నాయి. ఈ రోజు ఈమూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంజయ్ (నాగశౌర్య) అనుపమ (మాళవిక నాయర్) చదువు కోసం యూకేకు వెళ్తారు. ముందు స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. తర్వాత ప్రేమలో పడి సహజీవనం మొదలు పెడతారు. కొంత కాలం వీరి ప్రేమాయణం బాగానే సాగుతుంది. కానీ ఒక ఏడాది సీనియర్ అయిన అనుపమ.. తన ఉద్యోగం కోసం సంజయ్ ను వదిలి వెళ్లడానికి సిద్ధ పడటంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. ఆ దశ నుంచి వీరి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.”ఇది చాలా సహజంగా ఉండే సినిమా. పాత్రలు.. సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ స్క్రిప్టెడ్ అయితే సహజత్వం పోతుంది. అందుకే తెర మీద వ్యక్తులు నిజంగా మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది”.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా ఎలా ఉండబోతోందో వివరిస్తూ అ చిట్ చాట్లో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చెప్పిన మాటలివి.

ఐతే పాత్రల్ని సహజంగా తీర్చిదిద్దొచ్చు.. సంభాషణలు కూడా సహజంగా అనిపించేలా ఉండొచ్చు.. కానీ సినిమా అన్నాక ఎంతో కొంత డ్రామా ఉండాలి. సంఘర్షణ ఉండాలి. అన్నింటికీ మించి పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ అన్నది చాలా ముఖ్యం. ఇవేవీ లేకుండా ఒక ప్రేమకథను సాధారణంగా పరిచేసి చూడమంటే.. ప్రేక్షకులకు ఇన్‌ట్రెస్ట్ ఉండదు. సహజత్వం పేరు చెప్పి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’తో తన గత రెండు సినిమాలను అమితంగా ఇష్టపడ్డ వారికి కూడా టార్చర్ చూపించేశాడు దర్శకుడు. అబ్బాయి-అమ్మాయి మధ్య పరిచయం.. ఆ తర్వాత ప్రేమ.. అనుకోకుండా ఒక సంఘర్షణ.. ఆ తర్వాత ఎడబాటు.. చివరికి ఇద్దరూ ఒక్కటైతే కథ సుఖాంతం. ఈ లైన్లోనే ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లు బీటెక్ లో కలవడం.. ఆపై యూకేకు వెళ్లడం.. ముందు వేర్వేరు చోట్ల ఉండి తర్వాత ఒకే గూటికి చేరడం.. అక్కడ వంటలు చేసుకోవడం.. కలిసి పడుకోవడం.. నిద్ర లేవడం.. కార్లల్లో తిరగడం.. పార్టీలు చేసుకోవడం.. ఇలా ఏ మాత్రం నాటకీయత లేకుండా సన్నివేశాలు మామూలుగా సాగిపోతుంటాయి.

ఒక్కో సన్నివేశం ద్వారా అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాని విధంగా డాక్యుమెంటరీ నడిచినట్లే సినిమా నడిచిపోతుంటుంది. హీరో హీరోయిన్ల మధ్య ఒక బంధం ఏర్పడుతున్న ఫీలింగే ఏ దశలోనూ కలగదు. వాళ్ల మధ్య అసలు ఎడబాటు ఎందుకు వస్తుందో కూడా సరిగా చెప్పలేకపోయాడు దర్శకుడు. పాయింట్ ను చాలా బలహీనంగా.. క్లారిటీ లేనట్లుగా చూపించడంతో విరామ సమయానికే ప్రేక్షకుడికి నీరసం వచ్చేస్తుంది. ద్వితీయార్ధంలో కథను కొంచెం ముందుకు.. వెనక్కి చూపిస్తూ.. స్క్రీన్ ప్లేలో కొంత వైవిధ్యం తేవడానికి ప్రయత్నం జరిగింది కానీ.. అప్పటికే సినిమా పై ఆసక్తి పోతుంది. అవసరం లేని సన్నివేశాలు.. డైలాగులతో కాలయాపన చేసిన అవసరాల.. కథలో మలుపుకి కారణమైన.. హీరో హీరోయిన్ల మధ్య ఎడబాటుకు దారి తీసిన హాస్పిటల్ సన్నివేశాలను కనీసం దృశ్యరూపంలో చూపించకుండా చివర్లో మాటల రూపంలో మమ అనిపించడం అతను ఈ సినిమా తీయడంలో ఫెయిల్‌ అయ్యాడు అని చెప్పడానికి రుజువు. ఎలాంటి ప్రేక్షకుడి సహనానికి అయినా పరీక్ష పెట్టేలా ఈ సినిమా ఉంది.

నాగశౌర్య తన పాత్రలకు న్యాయం చేశాడు. ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో సాగే సినిమా కోసం అతను రకరకాల అవతారాల్లో కనిపించాడు. మాళవిక నాయర్ కూడా బాగా చేసింది. నాగశౌర్యలా లుక్స్ పరంగా వేరియేషన్ చూపించకపోయినా.. నటన పరంగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. అవసరాల తన కోసం రాసుకున్న పాత్రకు కనీస ఆసక్తిని జోడించలేకపోయాడు. తనలోని నటుడికి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. అన్ని పాటలూ ఆహ్లాదభరితంగా ఉన్నాయి.

టైటిల్‌ :ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’
నటీనటులు: నాగశౌర్య-మాళవిక నాయర్-అవసరాల శ్రీనివాస్-నటాషా దోషి తదితరులు
దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్
నిర్మాతలు: రెడ్డి
విశ్వప్రసాద్-పద్మజ దాసరి

చివరిగా: ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే సినిమా 

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates