Homeతెలుగు వెర్షన్నాగ అన్వేష్ ఏంజెల్ ఓపెనింగ్

నాగ అన్వేష్ ఏంజెల్ ఓపెనింగ్

నాగ అన్వేష్ ఏంజెల్ ఓపెనింగ్


ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో నూతన దర్శకుడు బాహుబలి పళని దర్శకత్వంలో యువ నిర్మాత భువన్ సాగర్ నిర్మిస్తున్న సినిమా ‘ఏంజెల్’. యూత్ స్టార్ నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత ఠాగుర్ మధు కెమెరా స్విచ్ అన్ చేయగా, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సప్తగిరిల పై దర్శకుడు పళని ముహర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ‘పాతికేళ్లు కష్టపడి చదివి, మరో పాతికేళ్లు కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్డ్ మెంట్ ముందు సెటిలై.. ఆ తరువాత లైఫ్ ని లీడ్ చేసే క్యారెక్టర్ కాదురా నాది అని హీరో నాగ అన్వేష్ అనగా… ‘నాది డిట్టో సేమ్ డైలాగ్’ అని సప్తగిరి చెప్పగా వాళ్లతో జాయిన్ అవుతూ హీరోయిన్ హెబ్బాపటేల్..’అంత లేన్తీ డైలాగ్ నా వల్ల కాదురా బాబు.. ప్రపంచంలో ఉన్న ఎంజాయ్ మెంట్ అంతా నాకే కావాలి.. అని అనగానే ఫస్ట్ షాట్ ని దర్శకుడు పళని ఓకే చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ దర్శకుడు బాహుబలి పళని మాట్లాడుతూ..
దర్శకుడు బాహుబలి పళని
మనం పాతికేళ్లు కష్టపడి చదివి, కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్డ్ మెంట్ ముందు సెటిలై ఆ తరువాత లైఫ్ ని లీడ్ చేస్తాం. కానీ ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ నానికి అంత పేషన్షీ లేదు. జీవితమన్నది పాస్టని, ఈ షార్ట్ స్పాన్ లో త్వరగా సంపాదించి త్వరగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే కారెక్టర్. ఈ క్యారెక్టర్ కి సరిపడే మరో ఫ్రెండ్ క్యారెక్టర్ సప్తగిరి. అలాంటి వీళ్ల మధ్యలోకి ఓ అమ్మాయి చేరుకుంటుంది. ప్రపంచలో ఉన్న సంతోషాన్నంతా అనుభవించాలనుకునే క్యారెక్టర్. అలా ముగ్గురు ఒక జోష్ ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు హీరో, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సడెన్ గా ఒక ప్రమాదంలో ఇరుక్కుంటారు. ఈ ప్రమాదము వాళ్ల మధ్యనున్న అమ్మాయే అనే విషయం తెలుసుకుంటారు. చివరకు వీళ్ళు ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటారన్నదే ఈ చిత్రం. ఆ ప్రమాదానికి కారణం ఒక కొత్త పాయింట్. ఇది కామెడీ, ఫాంటసీ, థ్రిల్స్ తో కూడి ఉంటుంది. ఎలా మొదలై ఎలా సంతోషంగా ముగిసిదన్నది ఏంజెల్ కథని తెలిపారు.
నిర్మాత భువన్ సాగర్
మొత్తం మూడు షెడ్యూల్స్ లో, హైదరాబాద్, కోనసీమలో షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత భువన్ సాగర్ చెప్పారు.
హీరో నాగ అన్వేష్
“చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వల్ల సినిమాల్లో నటించాలనే అభిలాష మొదటి నుంచీ ఉంది. బాలనటుడిగానే వెంకటేశ్ గారి లాంటి గ్రేట్ యాక్టర్ తో నటించే ఛాన్స్ రావడమే అదృష్టంగా భావిస్తున్నాను… ‘ఏంజెల్’లోని కథ, కథనం ఎంతో వైవిధ్యంగా ఉంటాయి… ఈ సినిమాతో మిమ్మల్ని ఆకట్టుకుంటానని ఆశిస్తున్నాను… ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్… అని అన్నారు
హీరోయిన్ హెబ్బా పటేల్
తన కెరీర్ లోనే ఏంజెల్ ఓ పెద్ద హిట్టు అవ్వాలని, త్వరలోనే ఓ అద్భుతమైన క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని మరింతగా అలరించబోతున్నట్లు తెలిపారు
నటడు సప్తగిరి మాట్లాడుతూ

ఈ సినిమాలో హీరో నాగ అన్వేష్ తో ట్రావెల్ అయ్యే ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నానని, అద్యంతం ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే రీతన ఏంజెల్ స్టోరీ రెడీ అయిందని.. అభిమానులకి కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu