ట్రేడ్ లో బిజినెస్ కిక్కిచ్చిన బాబు!

శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌ అభిషేక్ నామా , అవసరాల శ్రీనివాస్ హీరోగా , న‌వీన్ మేడారం ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A స‌ర్టిఫికేట్ పొందింది.  మే 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ప్ర‌స్తుతం ట్రేడ్ లో ఈ సినిమా ఓ సంచ‌ల‌నం గా మారింది. అన్ని ఎరియాల నుండి ప్ర‌తి డిస్ట్రిబ్యూట‌ర్ ఈ చిత్ర హ‌క్కులు కొన‌టం కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. మీడియం బ‌డ్జెట్ లో చేసిన ఏ చిత్రానికి రాని ట్రేడ్ లో క్రేజ్ ఇప్ప‌డు ఈ చిత్రానికి రావ‌టం అన్ని సెంట‌ర్స్ లో ఈ చిత్రాన్ని బిజినెస్ చేయ‌టం విశేషం. పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వుండ‌టం ఇంత క్రేజ్ కి కార‌ణం.
 
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ… అవ‌స‌రాల శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాల‌కంటే బాబు బాగా బిజి చిత్రం పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో  తెర‌కెక్కించాము. ఈ చిత్రం ద్వారా  నవీన్ మేడారం క‌మ‌ర్ష‌య‌ల్ ద‌ర్శ‌కుల లిస్ట్ లో చేర‌తాడు. యూత్ కి పూర్తి వినోదాన్ని వెండితెర‌పై ప‌రిచాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి  ఏపాత్ర‌కి వేరే పాత్ర‌తో లింక్ వుండ‌దు. ఎవ‌రివారే చాలా బాగా చేసి మెప్పించారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్ప‌టికే మార్కెట్ లో విడుద‌లై, చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే పాటలు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని  A స‌ర్టిఫికేట్ తో చిత్రం మే 5న పెర్‌ఫెక్ట్ స‌మ్మర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే బిజినెస్ ట్రేడ్ లో క్రేజ్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. పూర్తి వాణిజ్య‌విలువ‌లు క‌లిగివున్న చిత్రంగా మే నెల‌లో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.  అని అన్నారు.