‘ఖైదీ నెంబర్ 150’ నాలుగు రోజుల కలెక్షన్స్!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ అదరగొడుతోంది. సినిమా విడుదలయిన మొదటి రోజు దాదాపు 35 కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ కంటిన్యూ చేస్తూ రెండు మిలియన్లకు చేరువవుతోంది. సినిమా విడుదలయిన మొదటి రోజు ఓవర్సీస్ లో 8 కోట్లు వసూలు చేసినట్లుగా ధాఖాలు కనిపిస్తున్నాయి.

ఇండియాలో రెండవ రోజు 18 కోట్లు వసూలు చేయగా.. మూడవరోజుకి 16 కోట్లను కలెక్ట్ చేసింది. నాల్గవరోజుకి మరో 10 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.  ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం సినిమా మొత్తం నాలుగు రోజుల్లో 78 కోట్ల రూపాయలను వసూలు చేసి తన మార్క్ ను క్రియేట్ చేసుకుంది. బి,సి సెంటర్స్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడమే ఇంతటి భారీ విజయానికి కారణమని తెలుస్తోంది. మరి ఈ కలెక్షన్స్ ను ఇదే రేంజ్ లో ఖైదీ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి!