HomeTelugu Big StoriesGaami Trailer: హీరో సమస్యకి హిమాలయా కి సంబంధం ఏమిటి?

Gaami Trailer: హీరో సమస్యకి హిమాలయా కి సంబంధం ఏమిటి?

Gaami Trailer

టాలీవుడ్‌ నటుడు విష్వక్ సేన్ ప్రధానమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. కార్తీక్ శబరీశ్ – శ్వేత నిర్మించిన ఈ సినిమాతో, విద్యాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలై అప్డేట్స్‌ ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. సందీప్ రెడ్డి వంగ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు.

ట్రైలర్ లో మొత్తం ముగ్గురి కథలు చూపించారు. ఒక పాత్ర ఊరిలో దేవదాసిగా ఉన్న మహిళ, మరో పాత్ర పరిశోధనశాలలో బంధీగా ఉన్న ఓ కుర్రాడు, మూడో పాత్ర హీరో అఘోర. ఈ మూడు పాత్రల్లోని కథ చాలా ఇంటెన్స్ తో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

హీరో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అతను ఆ సమస్య నుంచి బయట పడటానికీ, 36 ఏళ్లకి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధం ఉంటుంది. ఆ పనిపైనే హీరో అక్కడికి బయల్దేరతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనేదే కథ. ఈ ట్రైలర్‌ చాలా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

ఈ సినిమాలో విష్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమా కాశీలోను.. హిమాలయాల్లోను షూటింగ్‌ జరుపుకుంది. కీలకమైన పాత్రలలో చాందినీ చౌదరి, అభినయ కనిపించనున్నారు. నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మార్చి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తన ఇమేజ్ కి భిన్నంగా విష్వక్ చేసిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu