HomeTelugu Newsమలయాళంలో మహేష్ బాబు

మలయాళంలో మహేష్ బాబు

మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన “భరత్ అనే నేను” సినిమా తెలుగు వెర్షన్ దాదాపు 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తాజాగా మలయాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సన్నిహితుడు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ ఈ చిత్రాన్ని మలయాళంలో అనువదించి విడుదల చేస్తున్నారు.

1 6

తెలుగులో మోహన్‌లాల్‌తో శిబు నిర్మించిన “మన్యంపులి” చిత్రం సంచల విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే చిత్రాన్ని మలయాళంలో “పులి మురుగన్” పేరుతో విడుదలై 100 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఏబీసీడీ, సామి వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన శిబు ఇప్పుడు భరత్ అనే నేను చిత్రాన్ని మలయాళంలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం మలయాళంలో కూడా భారీగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మలయాళంలో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu