మరో రీమేక్ లో వెంకీ..?

రీమేక్ కథలను ఎన్నుకోవడానికి ఏమాత్రం మొహమాట పడని హీరో వెంకటేష్. రీసెంట్ గా ఆయన నటించిన ‘గురు’ సినిమా కూడా రీమేకే.. ఈ సినిమా తరువాత వెంకటేష్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేయాల్సింది.. దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఎందుకో ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ తో కలిసి సినిమా చేయడానికి వెంకీ ప్లాన్ చేస్తున్నాడు.

ఈలోగా ఆయన మరో రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘మంతిరి వల్లికల్ తలిర్ క్కుంబల్’ అనే సినిమా ఇటీవల విడుదలయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో వెంకటేష్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలుపెడతారని చెబుతున్నారు.