యాంకర్ మరియు నటి అనసూయకు తాజాగా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్లో వీడియో చూస్తుండటాన్ని అనసూయ తన ఫోన్‌లో బంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు నన్ను భయపెడుతున్నాయి. ఇంతకు ముందు వేరే వారి తప్పిదం వల్లే నేను ప్రమాదానికి గురయ్యాను. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు.. రోడ్లపైకొచ్చి తమకిష్టమొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అంటూ ట్రాఫిక్ పోలీసులకు అనసూయ ట్వీట్ చేశారు.

అనసూయ ట్వీట్లకు నెటిజన్లు కౌంటర్‌గా రీట్వీట్లు చేశారు. మంచి కారణంతో వీడియో పెడితే ట్రోల్ చేస్తున్నారు. అయినా నేను చేసింది తప్పేమీ కాదు.. అంటూ మరో ట్వీట్ చేశారు.. దీంతో మరికొందరు ఆమెపై విరుచుకుపడుతూ ట్వీట్లు చేశారు. వారికి ఓపిగ్గా సమాధానమిస్తూ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కారు దిగి అతడికి చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా అన్న ఓ వ్యక్తి ట్వీట్‌కు బదులిస్తూ అలా చేస్తే యూట్యూబ్‌లో ఎలాంటి హెడింగ్స్ కనిపిస్తాయో అందరికీ తెలుసు అంటూ అనసూయ బదులిచ్చారు.













