రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ పై సినిమా టైటిల్ పక్కన ఓ ఉంగరం, రెండు బొమ్మలను చూపించారు. వాటిపై రిటర్న్ గిఫ్ట్ అని రాసుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా మరోసారి నటిస్తున్నారు.

‘కిక్’ ‘ఖతర్నాక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. దీంతో పాటు తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తెరి’ సినిమా రీమేక్‌లోనూ రవితేజ నటించబోతున్నట్లు సమాచారం. విజయ్ సి దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.














