HomeTelugu Newsగోపీచంద్‌ కొత్త సినిమా ప్రారంభం

గోపీచంద్‌ కొత్త సినిమా ప్రారంభం

7 11హీరో గోపీచంద్‌ కొత్త సినిమా షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాతో బిను సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఇదే కాంబినేషన్‌లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘సాహసం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ సినిమా గురించి చిత్ర బృందం మాట్లాడుతూ ఈ సినిమాలో కొంత భాగాన్ని.. ఇండియా, నేపాల్‌, కాంబోడియా, థాయ్‌లాండ్‌ దేశాల్లో చిత్రీకరిస్తున్నామని, ఈ సినిమాలో గోపిచంద్ క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండబోతుందని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సతీష్‌ కురువ్‌ అందిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.

గోపీచంద్ ప్రస్తుతం ‘చాణక్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను త‌మిళ ద‌ర్శకుడు తిరు డైరెక్ట్ చేస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ‘చాణక్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu