HomeTelugu Newsలస్ట్ స్టోరీస్ వెబ్ వెర్షన్ లో కైరా

లస్ట్ స్టోరీస్ వెబ్ వెర్షన్ లో కైరా

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో ఓ వెబ్ వెర్షన్ రూపొందుతోంది. ఈ సినిమాలో కైరా అద్వాని కుర్రకారును హీటెక్కించేలా బోల్డ్ గా నటించిందట. కేవలం వెబ్ లో మాత్రమే విడుదలయ్యే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను యూటూబ్ లో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే.

1

సెక్స్ తో రగిలిపోయే 4 జంటల కథలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. కైరాతో పాటు రాధికా ఆప్టే, మనీషా కోయిరాలా, భూమిపెద్నేకర్, నేహా దూపియా నటిస్తున్నారు. భరత్ అనే నేను మూవీలో ఎంతో సంప్రదాయంగా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కైరా ఈ సినిమాలో చాలా బోల్డ్ గా నటించిందని కరణ్ జోహార్ అంటున్నారు. కామం అనేది కూడా ప్రేమలాంటిదేనని వాటి రెండు భావాలు ఒక్కటే నని కరణ్ జోహార్ అంటున్నారు. భారతీయ సమాజంలో కామాన్ని ఏ విధంగా అణగదొక్కుతున్నారనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. సమాజంలోని దురాచారాలను ప్రశ్నిస్తూ ఈ సినిమా రూపొందించినట్లు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu