చిరుతో మరోసారి నయన్‌!

స్వతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే ఏడాది ఆగష్టు 15వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు.

కాగా, చిరంజీవి తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. జనవరిలో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా నయనతారను తీసుకున్నట్టుగా సమాచారం. దక్షిణాది భాషల్లో నయనతారకు మంచి క్రేజ్ ఉన్నది. సైరాలో మెగాస్టార్ పక్కన నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates