Homeతెలుగు Newsశ్రీకాకుళం జిల్లాకు హామీలు ఇచ్చిన సీఎం

శ్రీకాకుళం జిల్లాకు హామీలు ఇచ్చిన సీఎం

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వరాలు ప్రకటించారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న బాబు.. నవంబర్ లోగా వంశధార- నాగావళి నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన హామీలు ఇలా ఉన్నాయి..

12 9

-ఉద్దాన ప్రాంతానికి ఎంత ఖర్చయినా ఇంటింటికీ తాగునీరందిస్తాం. జిల్లాలో ప్రతి ఎకరాకూ నీరందిస్తాం
-25 గెడ్డలు, వాగులపై రూ.1500 కోట్లతో 50 చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాం
-వంశధార కుడి, ఎడమ కాలువల అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేస్తాం
-11 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.125 కోట్లతో పూర్తిచేసి 14 వేల ఎకరాలకు నీరందిస్తాం
-శ్రీకాకుళం నగరం సుందరీకరణకు 100 కోట్లు
-అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాల మాస్టర్ ప్లాన్‌కు రూ.50 కోట్లు
-శ్రీకాకుళం నగరం ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రూ.150 కోట్లు
-భావనపాడు పోర్టు నిర్మాణం కోసం రూ.500 కోట్లు
-కళింగపట్నం పోర్టు బీచ్‌ అభివృద్ధికి రూ.25 కోట్లు
-ఆర్ట్స్ కళాశాలలో రూ.15 కోట్లతో అదనపు వసతులు
-ఉద్దానం అభివృద్ధికి రూ.300

Recent Articles English

Gallery

Recent Articles Telugu