HomeTelugu Newsసింగం జోడి మరోసారి

సింగం జోడి మరోసారి

15

సింగం మూడు సీరిస్‌ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ మూడు సీరీస్‌కు యాక్షన్‌ చిత్రాల దర్శకుడు హరినే దర్శకత్వం వహించారు. ఇప్పడు ఈ దర్శకుడే మరోసారి సింగం కాంబినేషన్లో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే, ఈ చిత్రం సింగం సీక్వెల్‌ కాదట. పూర్తిగా యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా తీర్చిదిద్దబోతున్నాడట దర్శకుడు హరి. ఇప్పటికే ఈ స్టోరీని హీరో సూర్యకు వినిపించాడు. సూర్య హరితో సినిమా చేసేందుకు సిద్దంగానే ఉన్నట్లు సమాచారం. ఇదే స్టోరీని అనుష్కకు కూడా చెప్పాడట హరి. అనుష్క నుంచి ఎటువంటి రెస్పాన్స్‌ ఇంకా ఎటువంటి రెస్పాన్స్‌ రాటేదట. సూర్య.. అనుష్క జోడి అయితే బాగుంటుందని పట్టుబడుతున్నాడు. మరి అనుష్క ఈ సినిమాపై ఏం జవాబిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu