HomeTelugu Big Storiesసెక్స్ రాకెట్లో ఆ ఆరుగురు తారలు

సెక్స్ రాకెట్లో ఆ ఆరుగురు తారలు

టాలీవుడ్‌ను వరుస వివాదాస్పద ఘటనలు కుదిపేస్తున్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు మరువకముందే..చికాగో సెక్స్‌ రాకెట్‌ ఉదంతం తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి అలజడి రేపింది. అసలు టాలీవుడ్‌ ఇండస్ర్టీలో ఏం జరుగుతుందో అర్ధం కాక టాలీవుడ్‌ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే సెక్స్‌ రాకెట్‌కు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు ఎరగా వేసి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్‌ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి చికాగో ఫెడరల్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

11 a

సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఆరుగురు తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీతారలతో వ్యభిచారం ఎలా చేయించేవారో నటీమణులు విచారణలో తెలిపారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలను అమెరికాకు రప్పిస్తారు. డబ్బులు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతారు. తర్వాత తమ గురించి బయటపెడితే చంపుతామని బెదిరిస్తారని వివరించారు.

గత ఏడాది నవంబర్‌ 20న ఓ హీరోయిన్‌ ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా నవంబర్‌18న ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆలస్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగో వెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ప్రశ్నించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్‌లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్‌లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి ప్రశ్నించగా కిషన్‌ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి తారలను కూడా ప్రశ్నించారు.

11 1

కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ సెక్స్‌ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తేలాల్సి వుంది. ఈ కేసులో అరెస్టయిన వారిని వచ్చే గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. నెల రోజుల్లోపే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని, శిక్ష పడితే అది పూర్తయిన తర్వాత ఇద్దర్నీ దేశం నుంచి పంపేస్తారని ఓ అధికారి తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!