HomeTelugu Big Storiesసేవ పేరుతో రవి‘ప్రకాశం’.. సంజీవని దోపిడీ కథ..?

సేవ పేరుతో రవి‘ప్రకాశం’.. సంజీవని దోపిడీ కథ..?

ఎన్నో నీతులు చెబుతాడు.. సమాజాన్ని ఉద్దరిస్తామని మీడియాతో ప్రతిజ్ఞలు చేస్తాడు. కానీ అదే మీడియా సామ్రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీకి పథక రచన చేస్తాడు. తెలుగునాట నంబర్ 1 మీడియాను చెరబెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసి దోచుకున్న వైనం ఇప్పటికే వెలుగుచూసింది. ఇప్పుడు సంజివనీ ఆస్పత్రి పేరిట కోట్లు దోపిడీ చేసిన కథ కూడా విస్తుగొలుపుతోంది. కటకటాల వెనుకపడ్డ ఆ మాజీ జర్నలిస్టుల దోపిడీ ఠక్కుటమారా విద్యలు చూసి బాధితులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు.

Ravi Prakash Sanjeevani Hospital 1

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ తాజాగా వస్తున్న ఆరోపణలు విస్తుగొలుపుతున్నాయి. టీవీ9ను స్థాపించి ప్రజలను ఉద్దరిద్దామని బయలు దేరిన ఆయన సేవ చేద్దామంటూ ప్రజలను నమ్మించి విరాళాలు సేకరించి మోసగించిన వైనం విస్తుగొలుపుతోంది. టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ చేతిలో సంజీవని ఆస్పత్రి పేరిట దగా పడ్డ ఎంతో మంది ఇప్పుడు ఆయన గురించి వివరిస్తుంటే విస్తుపోవడం మనవంతవుతోంది.
కృష్ణ జిల్లా కూచిపూడిలో రవిప్రకాష్ అండ్ బ్యాచ్ ఇప్పుడు సంజివనీ ఆస్పత్రి పేరుతో దోచుకున్న వైనంపై బాధితులంతా కథలు కథలుగా చెబుతున్నారు. రవిప్రకాష్ ఫోర్జరీ ఉదంతం బయటపడడం.. పోలీసులు అరెస్ట్ చేశాక అతడిపై అధికారుల విచారణలో నమ్మలేని విషయాలు వెలుగుచూశాయట.. సంజీవని ఆసుపత్రి లో జరుగుతున్న అక్రమాలపై కృష్ణా జిల్లా వైద్యశాఖ అధికారుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటకొచ్చినట్టు సమాచారం. టీవీ9 లిటిల్ హార్ట్స్ పేరుతో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారుల ఆపరేషన్ల పేరిట విరాళాలు వసూలు చేసి దోచుకున్నారని అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. సంజీవని ఆస్పత్రికి విరాళం ఇస్తే ఇన్ కంటాక్స్ చెల్లింపు లో మినహాయింపులు ఉంటాయని అబ్దాలు చెప్పి నమ్మించారు.దీంతో బాధితులు భారీగా విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి పేరుతో జోలె పట్టి మరీ వసూళ్ళు చేశాడని ఇచ్చి నిండా మునిగామని చెబుతున్నారు.

సంజీవని ఆస్పత్రి లో తమకు వైద్యం దక్కుతుందని విరాళాలు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. విరాళాలు ఇచ్చాక ఆస్పత్రి సేవలే అందలేదని బాధితులు విచారణ కు వెళ్లిన అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఆ కుటుంబ పెద్ద కు హృద్యోగ సమస్య వచ్చి అత్యవసర చికిత్స కోసం రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి కి వెళితే సమయానికి వైద్యం అందక ఆ పెద్దాయన చనిపోయాడట.. కుటుంబం సభ్యులు ప్రభుత్వ అధికారులకు బ్యాంకు అధారాలతో సహా ఈ విషయం తెలుపడంతో సంజీవనీ ఆస్పత్రి మోసం కథ వెలుగులోకి వచ్చిందట.. టీవీ9లో ఫోర్జరీ, చీటింగ్ కేసులతో రవిప్రకాష్ అరెస్టు తర్వాత మీడియా సమావేశం పెట్టిన కూచిబొట్ల ఆనంద్ దాతల పేర్లను హడావుడిగా డిజిటల్ స్క్రీన్ పై ప్రచురించి ఆస్పత్రిలో దోపిడీ నిజం కాదని చాటిచెప్పే ప్రయత్నం చేశాడు.. స్క్రీన్ పై చూపిన పేర్లను , ఆ జాబితాను మీడియాకు నిర్భయంగా ఇవ్వకుండా పారిపోవడంతో కూచిబొట్ల ఆనంద్, రవిప్రకాష్ ల నిధుల స్వాహా పై అనేక అనుమానాలను బాధితులు వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులకు సైతం చేతగాని విధంగా వీరి దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది..
రవిప్రకాష్ సంజీవని ఆసుపత్రి పేరుతో జనం నమ్మకాన్ని రూపాయలలోకి మార్చుకుని దోచుకోవడంపై బాధితులు ఆక్రోషం వెల్లగక్కుతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో కథలు కథలుగా తమ బాధను వెళ్లగక్కుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu