తన టీంకు హీరోగారి స్పెషల్ గిఫ్ట్స్!

తమ కెరీర్ లో మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకులకు, చిత్రబృందానికి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం మన హీరోలకు అలవాటు. గతంలో మహేష్ బాబు తనకు శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన కొరటాల శివకు అత్యంత విలువైన ఆడి కారును బహుమతిగా ఇచ్చాడు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘పులి’ సినిమా విడుదల సమయంలో దాదాపు ఆ చిత్రబృందంలో ఉన్న 265 మంది యూనిట్ సభ్యులకు బంగారు నాణేలు కానుకగా ఇచ్చాడు. అదే మాదిరి ఇప్పుడు తన తాజా చిత్రయూనిట్ సభ్యులకు మరోసారి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు.
అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మెర్సల్’. గతంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తేరి’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మెర్సల్ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు పని చేసిన దాదాపు 200 మంది యూనిట్ సభ్యులకు విజయ్ బంగారు నాణేలు కానుకగా ఇచ్చారు. విజయ్ ఇచ్చిన కానుక యూనిట్ సభ్యులకు ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.