సమంతకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నెటిజన్‌

ప్రముఖ నటి సమంత చిన్నప్పటి ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేసి ఆమెను ఓ నెటిజన్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకుంది. ఈ సినిమా తమకు బాగా నచ్చిందంటూ నెటిజన్లు సమంతకు ట్వీట్లు చేస్తున్నారు. సమంతకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఆమెకు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. వారందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత అభిమాని ఒకరు ఆమె చిన్నప్పటి ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘ఫొటో ఆఫ్‌ ది డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటో చూసిన సమంత సర్‌ప్రైజ్‌ అయ్యారు. ‘అరె.. ఈ ఫొటో మీకెలా దొరికింది?’ అంటూ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యారు.

మరో అభిమాని.. సమంత, నాగచైతన్య, అఖిల్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఈ ఫొటోపై సమంత స్పందిస్తూ.. ‘ఆ రోజు మేం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా నాకు గుర్తుంది’ అని పేర్కొన్నారు. మరోపక్క నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘ఓ బేబీ’ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ వసూళ్లతో దూసుకెళుతోంది. సమంత కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. త్వరలో సమంత ’96’ రీమేక్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.