HomeTelugu Big Storiesహంద్రీ – నీవా క్రెడిట్ మహానేతకేనా?

హంద్రీ – నీవా క్రెడిట్ మహానేతకేనా?

రాయలసీమ కరువు తీరుస్తున్న హంద్రీ – నీవా సుజల స్రవంతి దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంగా రూపొందుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోఅరుదైనఎత్తిపోతలసాగునీటిపథకాలు ఉన్నప్పటికీహంద్రీ-నీవాపథకానికిఉన్నప్రత్యేకతలువేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి లేనన్నిపంప్హౌస్లు, మోటార్లు ఈఎత్తిపోతల పథకంలో ఉన్నాయి. ఇది అరుదైన సాంకేతిక అంశం. ఈపథకంలో 1,2 దశల్లో మొత్తం 43 పంప్హౌస్లనునిర్మించివాటిలో 269 యూనిట్లను (మోటార్, పంప్ కలిపిఒకయూనిట్) ఏర్పాటు చేయడం ద్వారా’’ ఎంఈఐఎల్‘‘ఈఘనతను సొంతం చేసుకుంది.
హంద్రీ – నీవా సుజల స్రవంతి ఆసియాలో అతిపెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం ఇదే. అయితే కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి లాంటి పథకాలు బాగా పెద్దవైనప్పటికీ వాటి నిర్మాణం ఇప్పటికీ పూర్తికానందున ప్రస్తుతానికి ఆసియాలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా హంద్రీ-నీవా గుర్తింపు పొందింది.

chandrababu hijacked YSR project

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, ఎత్తయిన ప్రాంతానికి నీటిని పంపింగ్ చేసేతాగు, సాగునీటి పథకాలు దాదాపు 80 ఏళ్ళక్రితమే చేపట్టారు. అయితే వీటన్నింటినీ కాళేశ్వరం రికార్డ్ బద్దలుకొట్టనుంది. ఇప్పటివరకు పూర్తయిన ఎత్తిపోతల పథకాల్లో హంద్రీ-నీవా ప్రాజెక్ట్లో మోటార్లు, పంపులు సంఖ్యాపరంగానూ, పంప్హౌస్ల నిర్మాణ పరంగానూ, ప్రాజెక్ట్ పొడవు విషయంలోనూ ప్రత్యేకతను సంతరించుకోవడంలో ఎంఈఐఎల్చేపట్టిన ఎలక్ట్రోమెకానికల్ పనులు చాలా కీలకమైనవి.
అనంతపురం జిల్లా దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం. ఇటువంటి కరువు ప్రాంతంలో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకం హంద్రీ – నీవా సుజల స్రవంతి పథకం. దీనికోసం రాష్ర్ట ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 40 టిఎంసీల కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లీంచేందుకు సంకల్పించినపుడు అమలు చేయడానికి నిధులు ఎక్కడివి, నీళ్లు ఎక్కడివి అనేప్రశ్నలు తలెత్తాయి. పంపులు, మోటార్ల నిర్వాహణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించినవారు ఉన్నారు. చిన్నపాటి ఎత్తిపోతలపథకాలను ఐడిసీ, ఆర్ఐసీలాంటి సంస్థలే నిర్వహించలేక మూతపడుతుంటే భారీస్థాయిలో పంపుహౌస్లను నిర్వహించడం సాధ్యమవుతుందా? అనేప్రశ్నలను లేవదీశారు. హంద్రీనది కర్నూల్ జిల్లాలోను, నీవా నది చిత్తూరు జిల్లాలోను ఉన్నాయి. ఈ రెండు నదులను కలుపుతూ ప్రధాన కాలువను ఎత్తైనకొండలు, గుట్టల మధ్య తవ్వుతూ నీటినికర్నూల్ జిల్లా మాల్యాల సమీపంలో కృష్ణానది నుంచి పంపింగ్ చేసేవిధంగానిర్మించారు.

వీటన్నింటికీ హంద్రీ-నీవా మొదటిదశను ఎంఈఐఎల్ పూర్తిచేసి 8 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ ఎటువంటి సమస్యలు, అవరోధాలు ఎదురుకాకుండా నీటిని పంపింగ్ చేయడం ద్వారా సంస్థ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడంతో పాటు ఎత్తిపోతల పథకాలు విజయవంతం అవుతాయని అదిఅమెరికాలోని కొలరాడో అయినా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అయినా అని నిరూపణ అయ్యింది. ఈపథకం క్రింద మొదటిదశలో 12 పంప్హౌల కింద 129 యూనిట్లు (మోటార్లు, పంప్లు) గత ఎనిమిదేళ్ళుగా సమర్థంగా పనిచేస్తున్నాయి. రెండో దశ పనులను కూడా అప్పుడే ప్రారంభించారు. కర్నూల్ జిల్లాలోని మాల్యా నుంచి చిత్తూరు జిల్లాలోని నీవా నది వరకు నీరు అందించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని పనులను ఒకేసారి ప్రారంభించారు.

రెండోదశ క్రింద అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలోని మడకశిర, పుంగనూరు బ్రాంచ్ కాలువ ద్వారా దాదాపు 565 కిలోమీటర్ల ప్రధానకాలువలో నీటిని పంప్చేయడం ఈసీజన్లో ప్రారంభించారు. 31 పంపింగ్ స్టేషన్లలో ఏర్పాటుచేసిన 140 యూనిట్లు పంపింగ్కు సిద్ధమయ్యాయి. ఇప్పటికీ 160 టీఎంసీల నీటిని కర్నూలు జిల్లా మాల్యాల నుంచి చివరి వరకు (చిత్తూరు జిల్లా) మొత్తం 43 పంప్హౌస్ల ద్వారా నీటిని తోడడం ద్వారా ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంతవరకు అమెరికా, చైనా తదితరదేశాల్లో ఎక్కడా కూడా ఒకఎత్తిపోతల పథకం కింద ఇన్నిపంప్హౌస్లు లేనేలేవు. అతిపెద్దదిగా పరిగణించే కాలిఫోర్నియాస్టేట్ వాటర్ ప్రాజెక్ట్, కొలరాడోతాంప్స్ంగ్ ప్రాజెక్ట్లలోకూడా 6 నుంచి 11లోపు పంపింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అక్కడి ప్రాజెక్ట్ల్లో మోటార్లు, పంప్లు కేవలం హార్స్పవర్ల సామర్థ్యంతో మాత్రమే ఏర్పాటయ్యాయి. కానీ హంద్రీ-నీవాలో మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేశారు. అంటే యూనిట్ల సామర్థ్యం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ భారీసామర్థ్యంతో ఏర్పాటయ్యాయి.

ఇక దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉండగా ఇప్పటివరకు పూర్తయినవాటిలో ఎక్కడా కూడా అన్నిపంపింగ్ స్టేషన్లు లేనేలేవు. నిర్మాణంలోఉన్నదేవాదులలో 20, కల్వకుర్తిలో 15, రాజీవ్భీమాలో 12, సీతారామలో 19, గండికోటలో 14 చొప్పున ఉన్నాయి. కాళేశ్వరం పూర్తయితే మొత్తం 82 పంప్లు వినియోగంలోకి వస్తాయి.
ఈ విధంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో మొత్తంమీదనే అత్యధిక పంప్హౌస్లు, వాటిలో భారీ సంఖ్యలో యూనిట్లు నిర్మించిన ఘనత ఎంఈఐఎల్కు హంద్రీ-నీవాప్రాజెక్ట్లోదక్కింది. మొదటిదశను 2012లోఅత్యంతక్లిష్టమైన 12 పంప్హౌస్ల నిర్మాణం పూర్తిచేసి సరాసరిన 200 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రెండోదశలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో తాగు, సాగునీరు అందించేవిధంగా ఈ ఏడాది పంపింగ్ పథకాలను ప్రారంభించారు.
హెచ్ఎన్ఎస్ఎస్ రెండోదశలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 4,04,500 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎంఈఐఎల్ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిరబ్రాంచ్ కెనాల్కు నీరు అందేలా నిర్మాణాలు పూర్తిచేసింది. ఈ కాలువ ద్వారా పెనుకొండ, హిందూపూర్, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 74,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 19 పంప్ హౌజ్లను నిర్మాణం చేసింది.

జీడిపల్లిపంప్ హౌజ్ ద్వారా మడకశిరబ్రాంచ్ కెనాల్ పై 155.2 కిలోమీటర్ల దూరంవరకు ఉన్న 18 పంప్ హౌజ్లకు నీటిని పంపింగ్ చేస్తారు. మడకశిర బ్రాంచ్ కెనాల్పైఎల్1 నుంచిఎల్ 17, ఎల్4 పంప్ హౌజ్లలో మొత్తం 81 పంపులను ఎంఈఐఎల్ ఏర్పాటుచేసింది. జీడిపల్లిపంప్ హౌజ్ వద్ద 132/6.6 కేవీవిద్యుత్ సబ్ స్టేషన్, మిగిలిన పంప్హౌస్ వద్ద 33/6.6 కేవీవిద్యుత్ సబ్ స్టేషన్లను ఎంఈఐఎల్ నిర్మించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu