HomeTelugu Newsహీరోయిన్‌ తల్లిగా మధుబాల

హీరోయిన్‌ తల్లిగా మధుబాల

సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది మధుబాల. ముఖ్యంగా రోజా సినిమాలో ఆమో నటనకు ఆడియన్స్‌ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్తుగా మారిన మధుబాల మంచిమంచి పాత్రలు చేస్తున్నారు. ‘అంతకు ముందు ఆ తరువాత, సూర్య వర్సెస్‌ సూర్య, నాన్నకు ప్రేమతో’ చిత్రాల్లో కీలక పాత్రలు చేశారామె.

4 6
ఇప్పడు తాజాగా కన్నడ చిత్రం ‘సీతరామకల్యాణ’ లో నటిస్తుంది. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి కొడుకు నిఖిల్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు.రచితా రామ్‌ కథానాయికగా నటిస్తున్నారు. రచితారామ్‌కు తల్లిదండ్రుల పాత్రల్లో మధుబాల, శరత్‌కుమార్‌ నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ బెంగళూరులో జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ‘జాగ్వార్‌’ సినిమాతో నిఖిల్‌ తెలుగుతెరపై కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu